కందనవోలు నంద్యాల

సరైన ధ్రువపత్రాలు లేని 10 వాహనాలు, 145 (180) ml అక్రమ మద్యం బాటిల్లు స్వాధీనం ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, నేర నియంతరణ కొరకే ఈ ఆపరేషన్స్ పోలీస్ వారి తక్షణ సహాయం కొరకు 112 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు శాంతిభద్రతల పరిరక్షణ నేర నియంత్రణ కొరకు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్  ఆదేశాలమేరకు ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా 07 పోలీస్ స్టేషన్ ల పరిధిలలో ఈ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది.కార్డెన్ అండ్ సెర్చ్ చేసిన పోలీస్ స్టేషన్స్ వివరాలు1. నంద్యాల మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బయటిపేట 2. పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగాలిమెట్ట గ్రామం 3. ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం గ్రామం.

4. వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోత్కూరు గ్రామం
5. జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుమంచాల గ్రామం 6. రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కలుగోట్ల గ్రామం
7. ప్యాపిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపొదిల్లా గ్రామం
మొదలగు ప్రాంతాలలో ఆయా పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లతో పాటు అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తులను స్వాధీనంలోనికి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 145 (180) క్వాటర్ బాటిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాలను నివారించడమే లక్ష్యంగా మరియు గ్రామాలలో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా నివారించుటకు పోలీసులు ప్రజల కొరకు ఉన్నారనే భరోసా కల్పించడం కొరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.ఈ సెర్చ్ ఆపరేషన్ లో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామంలోని అనుమానితులు, నేర చరిత్ర గల వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిలను స్వాధీనం చేసుకోవడం జరిగినది.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరంచనిచో జరిగే ప్రమాదములు మరియు ఆటోలలో ప్రయాణికులను పరిమితికి మించి రవాణా చేయడంవలన కలుగు ప్రమాదములు, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనము యొక్క ఆర్.సి మరియు ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత మరియు డయల్ యువర్ 112 కాల్ యొక్క ప్రాధాన్యత గురించి,తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు అధికారులు హెచ్చరించారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లు నిరంతరం కొనసాగుతుంటాయని పేర్కోన్నారు.

 

You missed