కందనవోలు కర్నూలు
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరపాలకకు చెందిన అన్ని విభాగాల అధికారులు హాజరు అవుతారని, కాలనీల్లోని మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధి వెలుగులు, పరిశుభ్రత వంటి సమస్యలను ప్రజలు లిఖిత పూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి ఫిర్యాదు స్వీకరించబడిన వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారం కోసం నిర్దిష్ట గడువులు నిర్ణయించబడతాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, ప్రతి ఫిర్యాదు పురోగతిని పౌరులు స్వయంగా https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్ వివరించారు.
