కందనవోలు కర్నూలు
ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీ సత్య సాయి బాబా సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి సందర్భంగా నగరపాలకలో బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సతీష్ మాట్లాడుతూ.. మానవతా విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో పాటించాలన్న బాబా బోధనలు నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు. “సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస” వంటి మానవ విలువలను అమలులో పెట్టడం ద్వారా సమాజం మరింత సాత్వికంగా మారుతుందని అన్నారు. సేవ భరతీయ సంస్కృతిలో అత్యున్నతమైన ధర్మమని, పేదలు–, లహీన వర్గాల పట్ల ప్రేమ, దయ చూపడం బాబా జీవిత సారాంశమని ఆయన తెలిపారు. యువత సేవా మార్గంలో ముందుండి సమాజ మార్పుకు దోహదపడాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఆర్‌ఐ తిప్పన్న, సిబ్బంది వినోద్, గోవిందు, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
