కందనవోలు కర్నూలు

విశాఖపట్నంలో ఈ నెల 22 , 23 తేదీల్లో జరిగిన ఏపీ
పదవ సబ్ జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్ డిస్టిక్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్- 2025 రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచి ఒక గోల్డ్, 5 సిల్వర్, బ్రాంజ్ 5 మొత్తం 11
మెడల్స్ సాధించారు. ఇందులో గ్రూప్ 1 బాలల, బాలికల విభాగంలో ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. గ్రూప్- 1 బాలుర విభాగంలో దేవ్ శృత్ సాయి 800 ఫ్రీ స్టైల్ లో గోల్డ్, 50,100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్, 400 ఫ్రీ స్టైల్ లో సిల్వర్, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో బ్రాంజ్ మెడల్స్, బాలికల విభాగంలో పి హేమలత 100 మీటర్స్ బట్టర్ ఫ్లై, 200 మీటర్స్ ఇండిజువల్ మిడ్లే లో సిల్వర్, 50, 100, 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో బ్రాంజ్ మెడల్స్, గ్రూప్ – 2 బాలికల విభాగంలో కె. శృతి 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ప్రతిభ కనబరిచిన సిమ్మర్లను డి ఎస్ డి ఓ భూపతిరావు, స్విమ్మింగ్ కోచ్ నటరాజ్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహ ఆచారి, సెక్రెటరీ రామకృష్ణ యాదవ్, ట్రెజరర్ దస్తగిరి, జాయింట్ సెక్రెటరీలు రామకృష్ణ శివరాజ్ అభినందించారు.

You missed