కందనవోలు కర్నూలు
పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తామని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ భారతదేశంలో సంఘటనలు జరుగుతుంటాయని పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప, ద్వేషాలు మాత్రం నాకు కానీ నా మిత్రుడు నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ కి ఎలాంటి అభిప్రాయ బేదం లేదని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే అలాంటప్పుడు ఎలాంటి ద్వేషాలు ఉండవు ఉండబోవు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులే పార్టీలో సస్పెండయి మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీలోన వేసిన విత్తనం మళ్లీ ఏదో ఒక రోజు మొలకెత్తుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి పని చేస్తాము. నాయొక్క సస్పెన్షన్ ను ఎత్తి వేసినందుకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ , ఎపిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి ధన్యవాదములు. మా ప్రతి పక్షనేత రాహుల్ గాంధీ నా ప్రత్యేక వందనాలు. రాహుల్ గాంధీ అడుగు జాడలలో మేము నడుస్తాము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి పని చేస్తాం ఎన్ని ఒరిదుడుకులు వచ్చిన మళ్లీ లేచి పని చేస్తాం. నా సస్పెన్షన్ విషయంలో ఎపిసిసి అధ్యక్షురాలు అమ్మ తల్లి ఈ విధంగా జరిగింది ఇది పరిస్థితి అని చెప్పగానే తక్షణమే క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు తో నేను మాట్లాడి కచ్చితంగా మీకు అండగా ఉంటాము. మీరు పార్టీ కోసం పని చేయండి. మీరు సీనియర్ నాయకులు ఈ సస్పెన్షన్ గురించి మీరు ఏమి భయపడకండి అని తక్షణమే నా సస్పెన్షన్ ను రద్దు చేయడం జరిగింది. ముఖ్యముగా వారికి ధన్యవాదములు అదేవిధంగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి నా యొక్క వందనములు క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు కూడా నా వందనములు నా కంట్లో ప్రాణం ఉన్నంత వరకు మేము పార్టీకి పని చేస్తాం మాకు శత్రువులు ఎవరు లేరని మాకు అంత మిత్రువులు మా పార్టీకి శత్రువులుగా ఉంటారో వారిని మేము శత్రువులుగా భావిస్తాం కానీ మా పార్టీలో మేము ఎప్పటికీ శత్రువులము కాము. ఈ పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదే విధముగా చాలా రోజుల తరువాత మా ఇంటికి వచ్చినట్టుంది సంతోషంగా ఉంది సంతోషంగానే పని చేస్తాము. కలిసి కట్టుగా అందరిని కలుపుకొని పార్టీ బలోపేతం కోసం ముందుకు వెళ్తాం ఇప్పటి వరకు కర్నూలు జిల్లాకు అధ్యక్షులు లేరు దానికి చింతిస్తున్నాము. ఇప్పటికి 9 నెలలు అవుతుంది జిల్లా అధ్యక్షులు లేరు కేంద్ర కమిటీ సభ్యులు వస్తున్నారు వారి ముందే అందరం కలిసి పార్టీ కి పని చేసే మంచి జిల్లా అధ్యక్షుడిని అందరమూ కలిసి అనుకుంటాము. ఈ కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం లో మా జండా ఎగరవేస్తాం గతంలో నేను జిల్లా అధ్యక్షులు గా పార్టీకి పని చేసింది 11నెలలు మాత్రమే అయిన నా శక్తికి మించి పని చేశాను. ఇప్పటికయినా పార్టీకి పని చేస్తాము. ప్రతి నియోజకవర్గం లో కూడా కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మాకు ఎలాంటి అడ్డంకులు వచ్చిన కూడా మేము కచ్చితంగా పోరాడతాం ప్రతి ఒక లీడర్ కూడా గెలిచేలా పోరాడతాము. అలాగే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే నాయకులు కర్నూలు జిల్లా లోనే ఉన్నారని గుర్తు చేస్తాము. ముఖ్యముగా విబేధాలు ఏవి ఉన్న కూడా మేము ఉండేది కాంగ్రెస్ జెండా కిందే మాకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి కాంగ్రెస్ పార్టీలో మేము ఒక కుటుంబము లాగే ఉంటామే తప్ప ఎలాంటి విబేధాలు ఉండవు. ఏ ఒక్కరి పైన కోపాలు లేవు ఎ రకాలైన గ్రూప్ లు లేవు మేము కాంగ్రెస్ పార్టీనీ కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్తాము అని బాబురావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, డిసిసి మాజీ సెక్రెటరీ బి సుబ్రహ్మణ్యం, ఎస్సీ సెల్ సిటీ అధ్యక్షులు డబ్ల్యు సత్యరాజు, ఐఎన్టియుసి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, ఐదవ వార్డు ఇన్చార్జి హుస్సేన్ భాష మొదలగువారు పాల్గొన్నారు.
