కందనవోలు కర్నూలు

ఉద్యోగులను ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బి మరియు రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.కొత్త ఇళ్లకు అద్దెలు రెండింతలు పెరగడం, సరైన ఇళ్లు దొరకకపోవడంతో ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా క్వార్టర్స్‌లో నివసిస్తున్న మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల పాఠశాలలు, చదువుల దృష్ట్యా కూడా ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయడం అసంభవమని తెలిపారు.హైకోర్టు బెంచ్ పేరుతో బెదిరింపులు చేస్తూ ఖాళీ చేయమని ఒత్తిడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని అసోసియేషన్ ఆగ్రహం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలను రోడ్డుపైకి తోసేయడం తగదని వారు కోరుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ తీవ్ర సమస్యపై తక్షణ పరిష్కార మార్గాలు చూపాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్వీ మోహన్ రెడ్డి  కలిసి బాధను తెలియజేశారు. ఉద్యోగ కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా చర్యలు తీసుకునేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి  పూర్ణ హామీ ఇచ్చారు.

You missed