కందనవోలు కర్నూలు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు వైసీపీ అరాచక పాలనను అంతమోదించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ,జనసేన,బీజేపీ లను కూటమి గా ఏర్పాటు చేయడానికి కృషి చేశారన్నారు… కూటమిలో భాగస్వామిగా ఉన్న మూడు పార్టీలకు సమాన గుర్తింపు తో పాటు, పదవుల కేటాయింపుల్లో సమన్యాయం జరుగుతుందన్నారు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన… కూటమి లోని నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు…ఈ కార్యక్రమంలో జనసేన కోడుమూరు నియోజకవర్గ నాయకులు సంధ్య విక్రమ్, గ్రామం టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
