కందనవోలు విజయవాడ,
స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రంగ సాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరగతి పత్రికల సమస్యలపై విపులంగా చర్చించారు. అక్రిడేషన్ జీవో నిబంధనలపై చర్చించారు. అక్రిడిటేషన్ జీవోలో పలు నిబంధనలు మార్పు చేసే చిన్న మధ్య తరహా పత్రికలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత కలిగిన పత్రికలకు ఎంపెనెల్మెంట్ చేయాలన్నారు. ఈ విషయమే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. అనిల్ కుమార్ రెడ్డి, కార్యదర్శి బి. గోపీనాథ్ రావు, కోశాధికారి డి. రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, సహాయ కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
