కందనవోలు నంద్యాల
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను రైతులకు అందించిన ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియం చేసుకొని డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. సంరక్షణల కోసం ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టి రైతాంగానికి అండగా నిలిచిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేననిఅన్నారు ,రైతాంగానికి ఏ మేలు చేయాలన్నా కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. పార్టీలకు అతీతంగా రైతాంగానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు….
