కందనవోలు కర్నూలు

డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
నగరంలోని ఆయన కార్యాలయంలో డిసెంబర్ 8వ తేదీ నగరంలోని కె.వి.ఆర్ మహిళా కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్ను మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకంతో పాటు మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించామని, ప్రస్తుతం నగరంలోని కెవిఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 8వ తేదీ జరగనున్న జాబ్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో దాదాపు 1350 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఇందులో పాల్గొని ఉద్యోగాలు పొందాలని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

You missed