కందనవోలు న్యూస్ బనగానపల్లె ..
బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పాలకమండలి చైర్మన్ & సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
దేవస్థాన పాలకమండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి విచ్చేసిన మంత్రికి నూతన పాలకమండలి చైర్మన్ & సభ్యులు, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – బీసీ ఇందిరమ్మ దంపతులు
నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం దేవస్థాన కమిటీ చైర్మన్ పి.వి నాగార్జున రెడ్డి & పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి చైర్మన్ మరియు సభ్యులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నందవరం గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
