కందనవోలు న్యూస్ బనగానపల్లె..
బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండల కేంద్రంలోని ఆర్ & బి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తుంచుకుంటుందని.. ఎవరి కష్టం వృధా కాబోదని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా
కోవెలకుంట్ల మండల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సావధానంగా విన్నారు.పార్టీ క్యాడర్ నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
