కందనవోలు కర్నూలు

41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో “బడి పిలుపు – వికసిత ఆంధ్రకు మలుపు” కార్యక్రమం భాగంగా తల్లితండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లితండ్రులకు విలువైన సూచనలు అందించారు.
చైర్‌పర్సన్ మాట్లాడుతూ,
పిల్లలను చదువులో ముందుకు నడిపే బాధ్యత తల్లితండ్రులదే అని,
ముఖ్యంగా అమ్మాయిల చదువును మధ్యలో ఆపకూడదని, నేటి సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పారు.
10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 90% మార్కులు సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు.
అంతేకాక పాఠశాల అభివృద్ధి అంశాలపై ఉపాధ్యాయులు ప్రతిపాదనలు సమర్పించారు.
పాఠశాల ప్రాంగణంలో ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
అసంపూర్తిగా ఉన్న గదులను త్వరగా పూర్తి చేయాలన్న అభ్యర్థనను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ ఈ విషయాలను ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తరువాత చైర్‌పర్సన్ ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్రాలజీ డిపార్ట్మెంట్ వీకర్ సెక్షన్ కాలనీ పాఠశాల అబ్జర్వర్ శ్రీ రాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ మేడం మ్యాథ్స్ టీచర్ రామచంద్రుడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ సోమలింగారెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

You missed