కందనవోలు న్యూస్. కర్నూలు
కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ పై అసత్య ఆరోపనలు చేయడం సరికాదని విశ్రాంత ఎపీఎన్జోవో జిల్లా నాయకులు తెలిపారు. కర్నూలు లోని ఏ.బీ.సీ క్వాటర్స్ లో కొందరు దళారులు అక్రమించుకొని బాడుగలు తీసుకుంటున్నారని అలాంటి వారిని ఖాళీ చేయిస్తుంటే మంత్రి పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని ఏపీఎన్జీవో విశ్రాంత అధ్యక్షుడు ప్రభుదాస్ తెలిపారు. ఏ.బీ.సీ క్వాటర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి భరత్ ప్రకటించారని ఇది శుభపరిణామం అన్నారు. ప్రభుత్వ క్వాటర్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు చాలా తక్కువ మంది నివాసం ఉన్నారని వారికి లేని అభ్యంతరం బయటి వ్యక్తులకు ఉందని వారు ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో ప్రభుదాస్, వై. రామయ్య,
రామాంజనేయులు, పీ. అబ్షాలోము రాజు, పుణ్యశేషుడు తదితరులు పాల్గొన్నారు.
