కందనవోలు కర్నూలు
కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఆదివారం నగరంలోని మౌర్య ఇన్‌లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్, వార్డు, బూత్ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతన కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. పార్టీ క్యాడర్ మొత్తం నిరంతరం కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల్లో మంచి పేరున్న నాయకులకు అవకాశాలు వాటంతటఅవే వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సర్వేలు చేసే టికెట్లు కేటాయిస్తామన్నారు. గతంలో తనకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో సర్వేలు చేసి ప్రజల్లో మంచి పేరు ఉన్నందుకే టికెట్ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు నమ్మకానికి తగ్గట్టుగా కష్టపడుతున్నట్లు టీజీ భరత్ చెప్పారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే.. ప్రతి వార్డులో ప్రధానమైన 3 సమస్యలు గుర్తించి ముందుగా వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. గూడెం కొట్టాల వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పట్టాలిచ్చినట్లు మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. ఏ,బీ,సీ క్యాంపు క్వార్టర్లలో కూడా అభివృద్ధి చేసేందుకే తాను ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ హైకోర్టు బెంచ్, కలెక్టరేట్ కార్యాలయం నిర్మిస్తామన్నారు. అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక అనవసరంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రతి ఒక్కరూ ప్రజలకు చేరవేయాలని క్యాడర్‌కు చెప్పారు. సోషల్ మీడియాను వాడుకోవాలని ఆయన కోరారు. అనంతపురం నుండి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌లా డెవలప్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు భారీగా వస్తాయన్నారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే టాప్‌లో ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ నాయకుడు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చినప్పటికీ వారి వైఖరి మారడంలేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు జగదీష్ గుప్త, సంతోష్, సంజీవలక్ష్మి, కాణిపాకం ఆలయ బోర్డు మెంబర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ శేషగిరి శెట్టి, మార్కెట్ యార్డు డైరెక్టర్ మారుతీశర్మ, కార్పొరేటర్లు జకియా అక్సారీ, పరమేష్, విజయ కుమారి, ఫరాజ్ ఖాన్, పద్మలతా రెడ్డి, ఖాదర్ బాషా, క్రాంతి, తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, నాయకులు హమీద్ బాషా, సుంకన్న, శేషు యాదవ్, రామాంజనేయులు, ఉట్ల రమేష్ బాబు, మోహన్, తిమ్మా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేంద్ర, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
