కందనవోలు కర్నూలు
న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అభినందించారు. అండర్ 19 విభాగంలో పాల్గొంటున్న పి. హేమలత అండర్ 17 విభాగంలో పాల్గొంటున్న కె. శృతి, సిరి చేతన రాజ్, పి. లహరి లను డిల్లీలో ఎంపీ అభినందించారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
