కందనవోలు నంద్యాల
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
ఈ సందర్బంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులు రూ. 5 లక్షలతో మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మించి గ్రామ ప్రజలు తాగేందుకు శుద్ధి చేసిన మంచి నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సుజాత, టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి, శరత్ గౌడ్, బలరాం, జయరామిరెడ్డి, బసవ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
