కందనవోలు నంద్యాల.

నంద్యాల పట్టణంలో కూనీ ఆపరేషన్లు నత్తనడకన సాగుతుండటంతో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ముల్లాన్‌పేట ప్రాంతంలో పిచ్చికుక్క దాడి ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క ముఖం, కాళ్లపై తీవ్రంగా కరిచి గాయపరిచింది. అదే కుక్క సమీప మార్కెట్ ప్రాంతంలో మరో నలుగురిపై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తీవ్రంగా గాయపడిన చిన్నారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పట్టణంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నా కూనీ ఆపరేషన్లు సక్రమంగా జరగకపోవడం, పిచ్చికుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే కూనీ ఆపరేషన్లను వేగవంతం చేసి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

You missed