కందనవోలు నంద్యాల…
నంద్యాల యువతకు మరో సువర్ణావకాశం .. ఎంఈపిఎంఎ _ఎన్ఐపి ఎన్ ఎ వారి ఆధ్వర్యంలో, _శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (ఆటానమస్), ఎస్ బి ఐ కాలని నంద్యాల_* లో 15 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్ మేళా ఈ నెల డిసెంబర్ 20న నిర్వహించబడనుంది అని కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య , ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు డా. యు.వి.ఎస్. కుమార్ మరియు సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా అనేక మంది నిరుద్యోగులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని తెలిపారు.ఈ మేళాకు పదవ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు పూర్తి చేసిన, 2016 నుంచి 2025 మధ్యలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చని చెప్పారు.జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు మార్క్స్ మెమో జిరాక్స్ కాపీలు – 3 జతలు రెజ్యూమ్ – 3 జతలు ఆధార్ కార్డు జిరాక్స్ – 3 జతలు అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
ఉద్యోగ మేళా వేదిక సుబ్బి రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం
శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పి జి కళాశాల ఎస్బిఐ కాలని నంద్యాల
తేది సమయం 20/12/25 ఉదయం 10.00 గంటలకు
