కందనవోలు కర్నూలు
శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ ఆదేశాల మేరకు,
డి.ఎన్.టి బాలుర వసతి గృహం, చింతలముని నగర్, కర్నూలు లో నివసిస్తున్న విద్యార్థులకు
బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు సమాజానికి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు కలిగించే దుష్పరిణామాలు,
విద్యా, ఆరోగ్య, మానసిక మరియు సామాజిక పరమైన నష్టాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.
అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులతో
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలను ప్రోత్సహించమని, వాటి నివారణకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
అలాగే మహిళలు, బాలికలకు కష్టసమయంలో అందుబాటులో ఉన్న
వన్ స్టాప్ సెంటర్ సేవలు, అక్కడ లభించే న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ మరియు పోలీస్ సహాయ సేవల గురించి వివరించారు.
అవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
ఏ.ఎస్.ఐ లలిత,
కౌన్సిలర్ సునీత,
పారా మెడికల్ సిబ్బంది రేష్మా పాల్గొని తమ విలువైన సూచనలు, అవగాహన సందేశాలు అందించారు.
విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
