కందనవోలు తిరువనంతపురం

తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ఆహ్వానంతో హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పవిత్ర నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ముర జపం మరియు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ–సమర్పణ కార్యక్రమాలలో స్వామీజీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తిరువనంతపురం రాజ కుటుంబ సభ్యులు మరియు ఆలయ అధికారులు స్వామీజీకి సంప్రదాయబద్ధమైన, ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీని శ్రీ పద్మనాభ స్వామి దర్శనానికి ఆలయ అధికారులు గౌరవపూర్వకంగా తీసుకెళ్లగా, స్వామీజీకి పరమేశ్వరుడైన శ్రీ పద్మనాభ స్వామి వారి దివ్య దర్శనం లభించింది.
తదుపరి హెచ్.హెచ్. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ కేరళ రాజ్ భవన్‌ను సందర్శించి, కేరళ గవర్నర్  శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్  కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్  స్వామీజీని ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామీజీ గవర్నర్  శ్రీ రాయర శేషవస్త్రం మరియు ఫల మంత్రాక్షతలను ఆశీర్వాదంగా అందజేశారు.
ఈ పర్యటన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా చేసి, సంప్రదాయం–ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించింది.

You missed