కందనవోలు న్యూస్ బనగానపల్లె..
బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఆదివారం మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముత్యాల మౌనిక పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మౌనిక మాట్లాడుతూ, పోలియో రహిత సమాజం అందరి లక్ష్యమని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గమని తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
