కందనవోలు కర్నూలు
కర్నూలు గిరిజన భవనం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కమిషన్ సభ్యులు పి వెంకటప్పకు ఆదివారం నాడు టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప అధ్యక్షతన ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు , కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ, నందికొట్టుకురు ఎమ్మెల్యే జై సూర్య, టిఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు అక్కులప్ప నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతనే గిరిజనుల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని అదేవిధంగా మారుమూల గిరిజన తాండలు, గూడేలలో రోడ్లు రవాణా విద్య వైద్య సౌకర్యాలు మెరుగయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డి ఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వం 16 సంక్షేమ పథకాలను రద్దుచేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పీ వెంకటప్ప గారు మాట్లాడుతూ కమిషన్ సభ్యులుగా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినటువంటి ఈ బాధ్యతను రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనల హక్కుల కోసం గిరిజన అభివృద్ధి కోసం కృషి చేస్తానని అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తండాలు గూడాలకు విడతలవారీగా పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అదే విధంగా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల పైన దాడులు గాని అత్యాచారాలు గాని అఘాయిత్యాలు గాని జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. అధికారులు కూడా గిరిజన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్, జాతీయ లంబడి సంఘం రాష్ట్ర అధ్యక్షులు యోగేష్, ఆల్ ఇండియా గిరిజన ఉద్యోగుల సంఘం రమణ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకు నాథ్, విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షులు శ్రీరాములు, టీఎస్ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామరాజు, జిల్లా కార్యదర్శి వెంకటేషులు, గిరిజన సంఘాల నాయకులు రాము నాయక్, కుశలన్న, విద్యార్థులు, ఉద్యోగస్తులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
