కందనవోలు కర్నూలు
ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్ లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయస్థాయి సబ్ జూనియర్ అండ్ జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.ఆదివారం కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయకుమార్,జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షులు సాయి కృష్ణ
తో కలిసి ఆయన అందజేశారు.ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 125 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయిలో జిల్లాకి అధికారులు ప్రతిభ చూపి పథకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అనంతరం కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం విజయకుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో యోగా క్రీడాభివృద్ధికి సంఘ నాయకులు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లా యోగా సంఘం సభ్యుల పాత్ర కీలకమన్నారు.ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంకు మాజీ డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి మునిస్వామి,కోశాధికారి విజయకుమార్,సభ్యులు గణేష్,భాస్కర్ రెడ్డి, రవికుమార్,అశోక్ రెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
