కందనవోలు కర్నూలు:
కురువలు అన్ని రంగాలలో రాణించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కురువలకు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు… కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించిన ఎంపీ, అనంతరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు… ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించినప్పుడు, ఈ సారి వదులుకుంటే మరోసారి కురువలకు అవకాశం రాదన్న ఉద్దేశంతో, ఆ టికెట్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదరుకున్నానన్నారు…తన కుల బాంధవులు కురువలందరూ ఏకదాటిగా మద్దతు తెలిపడంతోనే లక్షకు పైగా మెజార్టితో తో ఎంపీగా
గెలుపొందానన్నారు.. వచ్చే ఎన్నికల్లో కురువలకు జిల్లాలో ఒక ఎంపీ టికెట్ తో పాటు ఒక ఎం.ఎల్.ఏ టికెట్ వచ్చేలా కృషి చేస్తానన్నారు.. కురువలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి స్థానానికి పోటీ పడాలన్నారు…ఇక ఈ సారి జిల్లా పరిషత్ చైర్మన్ పడవని కురువలకు దక్కేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్న ఎంపీ, కురువలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రామకృష్ణ,ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు మరియు కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.
