కందనవోలు అమరావతి:

ప్రతీ రోజూ ఓ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయత్నిస్తున్నారు
⦁ ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది
⦁ ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే మా ధ్యేయం
⦁ స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి
⦁ చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం
⦁ అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది.
⦁ 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసింది
⦁ అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం
⦁ సుపరిపాలన దివస్ గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం.

⦁ తెలుగు నేలలో అలాంటి స్పూర్తి ఇచ్చే నేత ఎన్టీఆర్. వీరంతా చరిత్రను తిరగరాసిన నేతలు
⦁ నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.
⦁ వాజ్ పేయి ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది.
⦁ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకం.
⦁ మంచి వక్త, కవిగా, ప్రజాహృదయ నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు
⦁ వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించాం
⦁ నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్ ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు
⦁ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు
⦁ పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్రస్థానానికి తీసుకెళ్తున్నాం
⦁ ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి.
⦁ దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి.
⦁ అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు
⦁ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దార్శనిక నేత వాజ్ పేయి ఇద్దరూ దేశం కోసం పని చేసిన నేతలు
⦁ దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం
⦁ ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం.
⦁ 11 స్థానంలో ఉన్న భారత్ ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలతో అగ్రస్థానానికి చేరుకోబోతోంది.
⦁ 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి వస్తుంది. దేశాన్ని శిఖరాగ్రంలో నిలిపే శక్తి ప్రధాని మోదీకి ఉంది.
⦁ అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి
⦁ గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం.
⦁ నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు.
⦁ ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు.
⦁ హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది.
⦁ గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది
⦁ *పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు.*
⦁ *మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది.*
⦁ *పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం.*
⦁ *పీపీపీ అంటే ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు.*
⦁ *కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు… అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.*
⦁ *వాజ్ పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది.*
⦁ *ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం,*
⦁ గతంలో వాజ్ పేయి ఇప్పుడు నరేంద్ర మోది స్పూర్తిని ఇస్తున్నారు.
