కందనవోలు నంద్యాల…
నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్ లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకరక్షకుడు జన్మించిన ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్టియన్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు సహకారం అందేలా చూస్తామన్నారు. అనంతరం హోసన్న మందిర నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును మంత్రి ఫరూక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, క్రిస్టియన్స్ అభివృద్ధికి తమ శాఖ ద్వారా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నె కృపాకర్, 33వ వార్డు టీడీపీ ఇంచార్జ్ జోసెఫ్, 26వ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, జనసేన పబ్బతి రవి , మిద్దె ఉసేని , ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
