కందనవోలు కర్నూలు

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని కర్నూల్లోని బి.క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రెయిలీ స్ఫూర్తితో దృష్టిలోపం, ఇతర దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ‘ ఇంద్రధనస్సు ‘ లాంటి 7 వరాలను ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం ప్రకటించారన్నారు. కర్నూల్లో వీరి సమస్యల పరిష్కారానికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన చెప్పారు. తక్షణమే వీరికి ఐదు కంప్యూటర్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగాలని ఆయన వారికి సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుక్షణం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పుష్పరాజ్, తదితరులు పాల్గొన్నారు.
