కందనవోలు నంద్యాల…
ఆదివారం నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న పురాతనమైన, ప్రముఖ గుడి శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గౌరవ అతిధులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, జిల్లెల్ల శ్రీరాములు, రోటరీ జిల్లా మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామ మూర్తి పాల్గొన్నారు.
ఆలయానికి చేరుకున్న మంత్రి ఫరూక్ ను నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నుకోబడ్డ డాక్టర్ అనిల్ కుమార్ పురోహితుల వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో, మేళ తాళాలతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. ముందుగా మంత్రి ఫరూక్, ధర్మకర్తల మండలి,అతిధులు ఆంజనేయస్వామికి,సీతారామ స్వామికి పూజలు నిర్వహించారు.
తదుపరి ప్రమాణ స్వీకార కార్యక్రమం విక్టోరియా రీడింగ్ ప్రాంగణంలో నిర్వహించారు.దేవాదాయ శాఖ నంద్యాల ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణునాధ రెడ్డి నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు.చైర్మన్ గా నంద్యాలకు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వి.అనిల్ కుమార్ ప్రమాణం చేయగా, సభ్యులుగా పద్మావతి,బజరి, యం.నాగయ్య, ఎ.భారతి, ఎం.గురుబాబు,కె.వెంకటలక్ష్మి, ఎన్.జంబులయ్య,జి. వి. సుబ్బయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ నూతన చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లోని పలు దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని, ఇక ముందు కూడా ప్రధాన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం,మహానంది, యాగంటి, అహోబిలం వంటి ప్రముఖ ఆలయాలను, నవ నందులను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ రూపొందించి ప్రత్యేక ప్రణాళికతో నంద్యాల జిల్లాను ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణమండపం నిర్మాణానికి సహకరిస్తామన్నారు.అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పదవికి తనను,సభ్యులను ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు,మంత్రి ఫరూక్ కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ధర్మకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించి మంత్రి ఫరూక్ సహకారంతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని, దేవాలయంలో కళ్యాణమండపం నిర్మాణం చేపడతామన్నారు. వెదుర్ల రామచంద్రరావు, డాక్టర్ రవి కృష్ణ లు మాట్లాడుతూ నంద్యాలలో ఫరూక్ వివిధ శాఖల మంత్రిగా గత రెండున్నర దశాబ్దాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావించి వారి కృషిని కొనియాడారు. వివిధ ఆలయాలలో అభివృద్ధికి వారు చేసిన కృషిని ప్రస్తావించారు. వారి మార్గదర్శకంలో రానున్న కాలంలో నంద్యాల జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎవిఆర్ ప్రసాద్, కందుకూరి శ్రీరామ మూర్తి, జిల్లెల్ల శ్రీరాములు సమావేశంలో ప్రసంగించారు.
మంత్రి ఫరూక్ ను, అతిధులను అనిల్ కుమార్ ఘనంగా సత్కరించారు. చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ ను, సభ్యులను ఐఎంఏ నంద్యాల, మహిళా వైద్య విభాగం,రోటరీ క్లబ్,రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్, లయన్స్ క్లబ్, కళారాధన, దివ్యాంగుల జిల్లా సంక్షేమ సంఘం ప్రతినిధులు శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు చిట్టిబోట్ల భరద్వాజ శర్మ, జిల్లెల్ల శ్రీదేవి, డాక్టర్ అనిల్ కుమార్ సతీమణి డాక్టర్ హరిత, రాజేష్ ( బుజ్జి), సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు,కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి,ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, తెలుగుదేశం పార్టీ నాయకులు జాకీర్, తులసీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వైద్యులు,రోటరీ క్లబ్ సభ్యులు , పట్టణ ప్రముఖులు, ఆంజనేయ స్వామి దేవాలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
