కందనవోలు నంద్యాల…

నంద్యాల పట్టణం చామకాలువ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రమథ నందీశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు .శ్రీ ప్రమథ నందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా సి.వి. చెలం బాబు మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు
ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ సి.వి. చెలం బాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన శ్రీ ప్రమధ నందీశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి, రాజకీయాలకు అతీతంగా ఆలయ పురోభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతున్న ఇటువంటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని అన్నారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, రామచంద్రరావు, శాంతి రాముడు, రామకృష్ణారెడ్డి, ఏవిఆర్ ప్రసాద్, జిల్లెల్ల శ్రీరాములు, పాణ్యం రామయ్య, మిద్దె ఉసేని, కండె శ్యామ్ సుందర్ లాల్ , పసుపులేటి నారాయణ, రాజారాం మరియు టిడిపి నాయకులు, నంద్యాల పుర ప్రముఖులు, విద్యాసంస్థల అధినేతలు తదితరులు పాల్గొన్నారు

You missed