కందనవోలు కర్నూలు

కర్నూల్లో అడ్వకేట్ల సంక్రాంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లోని ఓ ఫంక్షన్ హాలులో కర్నూలు అడ్వకేట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఏ,బీ,సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు బెంచ్ తో పాటు కలెక్టరేట్ భవనం కూడా నిర్మిస్తామన్నారు.ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం బాటిళ్ల పేరుతో వైసీపీ చేసిన కుట్ర బయటపడిందన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించడం సరైంది కాదన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు బయటకు తీసి, బాద్యులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి ధోరణి వైసీపీ నేతలు ఇకనైనా మనుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలకు దగ్గరవ్వాలన్న ఆలోచన వైసీపీకి లేదన్నారు. తిరుమలలో ఎలాంటి తప్పులు జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ యలమంచి బాలాజీ, బొందిలి కార్పొరేషన్ ఛైర్మన్ విక్రమ్ సింగ్, టిడిపి లీగల్ సెల్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ కె.ఇ జగదీష్, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కర్నూలు బార్ అసోసియేన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాఘవేంద్ర, బీజేపీ నాయకులు లోకేశ్వరయ్య, పీపీలు శ్రీనివాస్ భట్, శ్రీహరి, శ్రీనివాసులు, రంగరవి, లక్ష్మి, రాజేశ్వర రెడ్డి, టిడిపి లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
