కందనవోలు కర్నూలు
సెయింట్ జోసెఫ్ కాలేజీలో వి.పి.ఎల్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంహా జరైన మంత్రి టీజీ భరత్

కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో వాసవి ప్రీమియర్ లీగ్-9 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలులో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించేలా కృషి చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఇక కర్నూలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో అందుబాటులో లేరని ఎవరైనా తన గురించి అడిగితే.. మంత్రిగా ఇతర రాష్ట్రాలు, దేశాలు తిరిగి పనిచేయాల్సిన అవసరాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నారు. తాను ఎక్కడ ఉన్నా కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం ఆలోచిస్తుంటానన్నారు. ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుధీర్, శ్రీకాంత్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
