కందనవోలు శ్రీశైలం
శ్రీశైలమహాక్షేత్రములో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వతేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహింపజేయడం జరుగుతోంది.
కాగా ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీస్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం జరిపించబడుతోంది.చెంచుభక్తులకు ప్రత్యేక ఆహ్వానం సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించడం జరిగింది. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచుభక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయబడుతున్నాయి.శ్రీశైలమహాక్షేత్రంలో గాఢమైన సంబంధంగల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.కాగా చెంచు భక్తులు శ్రీశైల భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచుమల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కాగా కల్యాణోత్సవానికి విచ్చేసే చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాలను పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రం కూడా అందజేయడం జరుగుతోంది.
