కందనవోలు కర్నూలు

 

 

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని భగవాన్ శ్రీ బాలసాయి బాబా ఆచరించి పేదలకు ఎనలేని సేవలందించారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలోని పాతబస్తీలో గల శ్రీనిలయంలో నిర్వహించిన బాలసాయి బాబా జయంతి వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జి వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా కుట్టు మిషన్లు, కూరగాయల తోపుడు బండ్లు, గ్రైండర్లను, వికలాంగులకు ట్రై సైకిళ్లను వారు పంపిణీ చేశారు.. అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ నిస్వార్థంగా సేవ చేసే వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.. బాలసాయి బాబా తన ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థ లు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించడం తో పాటు, పేద ప్రజల ఉపాది కి సాహయ సహకారాలు అందించారన్నారు.. ఆయన మరణానంతరం కూడా ట్రస్ట్ సభ్యులు బాబా ఆశయాలు, సేవ కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి, బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ రామారావు, బాబా భక్తులు పాల్గొన్నారు..

You missed