కందనవోలు కర్నూలు
సోషల్ మీడియా కార్యకర్త సునీల్ పడాలపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై.. మాల మహానాడు నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని టిడిపి ఎస్సీ సెల్ విభాగం నేతలు హెచ్చరించారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఎస్సీ విభాగం నాయకులు పామన్న, సుంకన్న, ఏసన్న ,పాల్రాజ్, మాధవస్వామి, మోహన్, ప్రభాకర్, కార్పొరేటర్ క్రాంతి ,చినమ్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసి బహిష్కరణకు గురైన పడాల సునీల్ అనే వ్యక్తిపై టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ దాడి చేశారని, ఇందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రమేయం ఉందంటూ మాల మహానాడుకు చెందిన కొందరు నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరి కాదని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితమే పడాల సునీల్ అనే వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కూడా పడాల సునీల్ టిడిపి నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు సమాజంలో పలుకుబడి ఉన్న వారిపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వచ్చారని స్పష్టం చేశారు. పడాల సునీల్ కర్నూల్ నగరానికి చెందిన ఒక పెద్ద నాయకుడితో ఫోటోలు దిగి తాను ఆయన అనుచరుడునని చెప్పుకుంటున్నారని, అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే వారికి కూడా సమాజంలో విలువ ఉండదని చెప్పారు. సోషల్ మీడియా ఆక్టివిస్ట్ పడాల సునీల్ హాస్పిటల్ లో ఉన్నారని.., తమకు వ్యతిరేకంగా పోస్టు పెట్టాడు అన్న కారణంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ తన అనుచరులతో దాడి చేయించారని, ఇందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రమేయం ఉందంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో మాల మహానాడుకు చెందిన కొందరు నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఎంత మాత్రం తగదని చెప్పారు. మాల మహానాడు నాయకులు తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. పడాల సునీల్ హాస్పిటల్ లో చేరడానికి అతనిపై దాడి జరిగిందో లేక ప్రమాదంలో గాయపడ్డాడో మరియు ఇతర కారణాలు ఏమున్నాయో తమకు తెలియదని, అనవసరంగా మంత్రి టీజీ భరత్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని తెలియజేశారు. ఇప్పటికైనా మాల మహానాడులోని కొందరు నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తో పాటు టిడిపి నాయకులపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కర్నూల్ నగరంలో కుల మతాలకు అతీతంగా దశాబ్దాలుగా టీజీవి కుటుంబం సేవలందిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే కర్నూల్ నగరంలో దళిత వార్డుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ హాల్ ల నిర్మాణంతో తో పాటు చర్చలకు సహాయం చేస్తూ టీజీవి కుటుంబం అందరి మన్ననలు అందుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రానికి అధిక సంఖ్యలో పరిశ్రమలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. రాష్ట్రం కోసం, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను అభినందించాల్సింది పోయి ఆయనపై వాస్తవ దూరమైన విమర్శలు చేయడం ఎంత మాత్రం తగదని తెలిపారు.
