కందనవోలు కర్నూలు

కర్నూలు నగరంలో జాతీయ రోడ్డు భద్రత 37వ మాసోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణలో 14వ రోజు కొనసాగుతున్నాయి, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు లో భాగంగా ఈ నెల 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సంధర్బంగా 14వ తేదీ తెల్లవారు జామున ఎస్. శాంత కుమారి, ఉప రవాణా కమిషనర్, ఆదేశాలతో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. బస్సు కి సంబంధించి అన్ని వాలిడ్ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ మరియు భద్రతా ప్రమాణాలు అనగా ఎమర్జెన్సీ ఎక్ఇటూ, ఫైర్ ఎక్స్టింగుషర్స్, సేఫ్టీ హ్యామర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పరిశీలించారు. బస్సులో పేలుడు పదార్థాలు మరియు కమర్షియల్ సామాన్లు తీసుకొని వెళుతున్నారా అని తనకి చేశారు. మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక రద్దీ కారణంగా, అధిక టికెట్ ధరలు ప్యాసింజర్ల పై వసూలు చేస్తున్నారా అని తనికి చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన బస్సు ల పై 7 (ఏడు) కేసు లు రాసి ₹30,000/- జరిమానా విధించారు. ఈ తనకి లో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున మరియు సిబంది పాల్గొన్నరు.
