కందనవోలు నంద్యాల

 

 

నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సమాజంలో పత్రికలు, మీడియా కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో జర్నలిస్టుల కృషి అభినందనీయమని తెలిపారు. ఈ క్యాలెండర్లను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొంటూ, సదరు మీడియా సంస్థల యాజమాన్యాలకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కందనవోలు బ్యూరో ఇంచార్జ్ ఎలిజిబెత్ రాణి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ అజ్మీర్, భాస్కర్, సైలాబ్, బాలస్వామి , పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

You missed