కందనవోలు వైస్సార్ కడప

 

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ  షెల్కే నచికేత్ విశ్వనాథ్  జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

జిల్లాలో ఏకకాలంలో ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా పోలీస్ అధికారులు ప్రజల భద్రత , శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా సోమవారం రాత్రి ఆకస్మికంగా రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.భారీ పేలుడు సంఘటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు విస్తృతంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. బస్ స్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో అనుమానస్పద లగేజ్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 

You missed